మేడి లక్ష్మణ్‌పై చర్యలు తీసుకోవాలి…..మేడి లక్ష్మణ్‌కు భయపడి 7 నెలలుగా హైదరాబాద్‌కే పరిమితమైన చెల్లెలు పద్మజ్యోతి….అనారోగ్యంతో తల్లిదండ్రులను చూసేందుకు వచ్చిన చెల్లెలిపై అన్న,వదినల దాడి…. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని బాధితురాలి ఆవేదన…..

బోధన్ జూన్ 15 (ప్రతినిధి): కుటుంబ కలహాల నేపథ్యంలో తన సొంత అన్న,వదిన తనపై దాడి చేసి ఇంటి నుంచి బలవంతంగా బయటకు పంపించారని బోధన్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన పద్మ జ్యోతి ఆరోపించారు.తనకు ప్రాణహాని ఉందని,తాను ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యా రు.బాధితురాలు పద్మజ్యోతి తెలిపిన వివరాల ప్రకా రం..పెగడపల్లి గ్రామానికి చెందిన తపాలా శాఖ ఉద్యోగి మేడి లక్ష్మణ్ తన సోదరుడు కాగా,గత కొంతకాలంగా కుటుంబ విభేదాల కారణంగా తనను మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు.పరిస్థితులు తీవ్రరూపం దాల్చడంతో తన ప్రాణ భద్రత కోసం గత ఏడు నెలలు గా హైదరాబాద్‌లో నివసిస్తున్నట్లు వెల్లడించారు.ఇటీవ ల అనారోగ్యానికి గురైన ఆమె,తల్లిదండ్రులను కలుసు కోవడానికి మరియు ఆరోగ్య పరిస్థితుల కారణంగా స్వగ్రామానికి వచ్చినట్లు చెప్పారు.అయితే ఇంటికి వచ్చిన వెంటనే అన్న మేడి లక్ష్మణ్, వదిన జయశ్రీ తనతో గొడవకు దిగారని,అనంతరం తనపై దాడి చేశారని ఆరోపించారు.“నన్ను దుర్భాషలాడుతూ పిడిగుద్దులతో కొట్టారు అని,మెడ పట్టుకుని ఇంటి నుంచి బయటకు గెంటేశారు అని,నా ప్రాణాలకు ముప్పు ఉందనే భయంతోనే ఇంతకాలం హైదరాబాద్‌ లో ఉన్నాను అని తెలిపారు.ఇప్పుడు గ్రామానికి వచ్చినా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు”అని పద్మ జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై తాను స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు.తన ఫిర్యాదును పోలీసులు వెంటనే పరిశీలించి,నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే తనకు,తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. సంబంధిత అధికారులు స్పందించి ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.