విద్యాశాఖ వైఫల్యంపై కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘాల ధర్నా. -అనుమతులేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్, జూన్ 15( ప్రజాగళం )

విద్యాశాఖ వైఫల్యంపై కలెక్టరేట్ వద్ద సోమవారం విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. జిల్లా వ్యాప్తంగా అనుమతి లేని ప్రైవేటు పాఠశాలల పైన చర్యలు తీసుకోవడంలో జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారుల వైఫల్యాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్,పీడీఎస్ యు, ఎఐపిఎస్ యు,డిఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు నిజామాబాద్ జిల్లా కమిటీగా ఏర్పడి సమస్యలను కలెక్టర్ కు విన్నవించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేని ప్రైవేటు విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవాలని గత రెండు నెలల నుండి జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని కానీ జిల్లా విద్యాశాఖ అధికారి పత్రిక ప్రకటనలు తప్ప చర్యలు తీసుకోవడంలో పూర్తిస్థాయి విఫలం చెందుతున్నారని, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారిని మండల విద్యాశాఖ అధికారులు తప్పు ద్రోవ పట్టిస్తూన్నారన్నారు. విద్యార్థుల జీవితాలను బాగు చేయాల్సిన విద్యాశాఖ అధికారులే విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
తక్షణమే ఈ విషయంపైన స్పందించి మండల విద్యాశాఖ అధికారులపైన చర్యలు తీసుకోని, దాంతో పాటు అనుమతి లేని పాఠశాలలను సీజ్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేయాలని నిజామాబాద్ జిల్లా విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నామన్నారు.జీవో 37 ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ఫ్రీ స్ట్రక్చర్ వివరాలు పొందుపరిచాలన్నారు. జీవో నెంబర్ 91/1983 చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో క్యాపిటేషన్ ఫీజులు తీసుకోరాదన్నారు.జీవో ఎంఎస్ నెంబర్ 22 ప్రకారం ప్రైమరీ అప్పర్ ప్రైమరీ హై స్కూల్స్ లో బ్యాగ్స్ లో అధిక బరువును తగ్గించుట గురించి (18-07-2017) ప్రభుత్వాలు జీవోలు విడుదల చేసిందన్నారు.
ప్రైవేట్ పాఠశాలలు జిల్లా కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా ఫీజు రెగ్యులేషన్ కమిటీ నిర్దేశించిన్నట్లుగా ప్రైవేట్ పాఠశాలలు నడుచుకోవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.