ఎడపల్లి గ్రామంలో కుర్మే కులస్తుల ఆధ్వర్యంలో ఘనం గా బోనాల పండుగ వేడుకలు…

 

ఎడపల్లి,జూన్ 22: (ప్రజా గళం)

ఎడపల్లి మండల కేంద్రంలో స్థానిక కుర్మే కుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బోనాల పండుగను భక్తిశ్రద్దల తో ఘనంగా నిర్వహించారు.మూడు తర్పలా కుర్మే కుల సంఘాల వారు బోనాల పండుగ జారుపుకున్నా రు.పిల్ల పాపల తో కుటుంబ సభ్యులు బోనం ఎత్తుకొని గ్రామ శివారులోని గోవింద్ పూర్ వద్దగల వారి కుల దైవమైన బీరప్ప ఆలయానికి డప్పు చప్పులతో ఊరే గింపుగా వెళ్లారు.ముందుగా బీరప్ప ఆలయానికి చేరు కొని అక్కడ బోనాలు సమర్పించి భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే మల్లయ్య దేవునికి భక్తితో పూజలు నిర్వహించారు.అనంతరం మేకలను బలిచ్చారు.సంతోషం,ఆనందోత్సాహల మధ్య పండుగ వేడుకలు జరుపుకున్నారు.వర్షాలు పుష్కలంగా కురవా లని,పాడి పంటలు సమృద్ధిగా పండాలని,గొడ్డు గోజ, గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ కుర్మే కులస్తులు బోనం పండుగ నిర్వహించినట్లు వారు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.