ఆర్మూర్ జూన్ 22 (ప్రజాగళం)
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మండలాల నూతన అధ్యక్షులుగా జిల్లా డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి ఈమెరకు ప్రకటించారు. ఆర్మూర్ పట్టణ అధ్యక్షులుగా తిరిగి సాయిబాబా గౌడ్ ను నియమించారు. ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నాగరాజు, మాక్లూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా దయాకర్ నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వెంకటేష్ డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా

బాబురావులను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయా మండలాల నూతన అధ్యక్షుల ను స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు అభినందించారు. శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సాయిబాబా గౌడ్ తిరిగి ఎంపిక చేయడంతో పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చినట్టు అయింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నూతనంగా ఎన్నుకోబడ్డ మండలాల అధ్యక్షులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తాము కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధ్యంలో ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

