నందిపేట్ క్రైమ్ జూన్ 29 (ప్రజా గళం)
మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తికి ఏడు రోజుల జైలు శిక్ష విధించారు. దీనికి సంబంధించిన వివరాలను నందిపేట ఎస్సై వినయ్ వెల్లడించారు. ఈనెల 9వ తేదీన నందిపేట్ మండల కేంద్రంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా బోధన్ కు చెందిన నసీరుద్దీన్ అనే వ్యక్తి మద్యం సేవించి పట్టుబడినట్లు ఎస్సై వెల్లడించారు. అతనిపై కేసు నమోదు చేసి సోమవారం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి గట్టు గంగాధర్ మద్యం సేవించి వాహనం నడిపిన నసీరుద్దీన్ కు 7 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించినట్లు తెలిపారు. ఎవరైనా మద్యం సేవించి వాహనం నడిపితే వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని నందిపేట్ ఎస్సై వినయ్ హెచ్చరించారు.

