నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు.

 

నిజామాబాద్, జూలై 01 ( ప్రజాగళం ప్రతినిధి )

 

వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో పి శ్రీనివాస్ అనే వ్యక్తి పేరుతో నకిలీ మీడియా అక్రెడిటేషన్ కార్డు చెలామణి అవుతున్న నేపథ్యంలో, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారిణి ఎన్.పద్మశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. సదరు కార్డు సమాచార పౌర సంబంధాల శాఖ, నిజామాబాద్ జిల్లా కార్యాలయం నుండి జారీ చేయబడలేదని స్పష్టం చేశారు. సదరు వ్యక్తి జిల్లా కలెక్టర్ గారి ఫోర్జరీ సంతకంతో నకిలీ కార్డును తయారు చేసినట్లు తమ దృష్టికి వచ్చిన వెంటనే, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశామని అన్నారు. ఎవరైనా ఈ తరహాలో నకిలీ, బోగస్ అక్రెడిటేషన్ కార్డులు తయారుచేయడం, వినియోగించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.