బిజెపి 12 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిన అభివృద్ధి వివరించాలి. ప్రతి ఒక్కరు ఓటు కల్పించుకునేలా బి ఎల్ ఏ లు బాధ్యత తీసుకోవాలి. రేణుక ఎల్లమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. పొన్నం ప్రభాకర్ కు ఘన స్వాగతం

 

 

 

 

ఆర్మూర్ జూలై 1(ప్రజాగళం)

 

ఆర్మూర్ పట్టణంలోని పేర్కిట్ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు గౌడ సంఘ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం మాజీ పిసిసి కార్యదర్శి ఖాందేశ్ శ్రీనివాస్ కూతురు రష్మిక, వినయ్ నూతన దంపతులను మంత్రి పొన్నం ఆశీర్వదించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ బిజెపి జాతీయ అధ్యక్షుడు నథిన్ నబీ రాష్ట్రంలో 12 ఏళ్ల బిజెపి పాలన ఏం అభివృద్ధి చేసిందో పొన్నం ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు.

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా బీఎల్‌వోలు బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ లక్షలాది ఓట్లను తొలగించి ఎన్నికల ఫలితాలను తారుమారు చేసిందని ఆరోపించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబి గత 12 ఏళ్ల బీజేపీ పాలనలో దేశానికి చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని మంత్రి ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతూ, రాష్ట్ర అభివృద్ధికి సహకరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు.రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన అనేక హామీలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అనేక సందర్భాల్లో అవహేళన చేసిన పార్టీ బీజేపీయేనని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆరోపించారు.

 

ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి, పి సి ఎస్ చైర్మన్ మునిపల్లి సాయి రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి రఘు,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిబాబాగౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు బదాం నాగరాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగ గౌడ్, సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ఎసిపి వెంకటేశ్వర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.