సాలూరలో ఘనంగా బాబు జగ్జీవన్ రాం వర్దంతి వేడుకలు….

 

 

బోధన్ ప్రతినిధి,జూలై 6: (ప్రజా గళం)

భారత మాజీ ఉప ప్రధాని డా.బాబు జగ్జీవన్ రాం 40వ వర్దంతి వేడుకలను సోమవారం సాలూర మండల కేంద్రంలో దండోర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ హించారు.ఈ సంధర్బంగ నాయకులు బాబు జగ్జీవన్ రాం విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం సంఘ అధ్యక్షులు దమ్మన్ గావ్ సుభాష్ మాట్లాడుతూ..బాబు జగ్జీవన్ రాం బడు గు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని,దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివ ని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు లస్మయ, పోశేట్టి,లాలయ్య,వీరేశం,గంగారాం,భారి,రాజు,సంతోష్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.