విద్యుత్ శాఖ ఉద్యోగులకు తక్షణమే పిఅర్సీ అమలు చేసి 14 డిమాండ్లను పరిష్కరించాలి….విద్యుత్ ఉద్యో గులు డిమాండ్…..ఎడపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ లో నల్ల బ్యాడ్జిలతో ఉద్యోగులు నిరసన…..

 

 

ఎడపల్లి,జూలై 15: (ప్రజా గళం)

విద్యుత్ ప్రైవేటేషన్ టెండర్ లను వెంటనే రద్దు చేయా లని,తక్షణమే పిఅర్సీ అమలు చేయాలని,ఆర్డీజన్ లో ని ఈపిఎఫ్,జిపిఎఫ్ తో పాటు కొన్ని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎడపల్లి మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో నల్ల బ్యా డ్జిలు ధరించి ఉద్యోగులు నిరసన తెలిపారు.తెలంగా ణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపుమే రకు విద్యుత్ శాఖ ఉద్యోగులు నల్ల బ్యాడ్జిలు ధరించి సబ్ స్టేషన్ లో నిరసన తెలిపారు.ఈ సందర్బంగా ఉద్యోగస్తులు మాట్లాడుతూ..గత నాలుగు సంవత్సరా లకు ఒకసారి రావల్సిన పిఅర్సీ,ఏప్రిల్ నెలలో రావాలని అన్నారు.కానీ ఇందుకు సంబందించిన కమిటీని ఇప్పటి వరకు వేయలేదని అన్నారు.జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జాకో ఇచ్చిన పిలుపుమేరకు దఫలుగా రెండు రోజుల పాటు ఉద్యోగులు విధులు నిర్వహిస్తూనే నల్ల బ్యాడ్జిలు ధరించి పిఅర్సీ తో పాటు 14 సమస్యల ను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది అన్నారు.వెంటనే తమ న్యాయమైన పిఅర్సీని అమలు చేసి,14 డిమాండ్లను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో ఎడపల్లి సబ్ డివిజన్ ఎడిఈ,ఎఈ. సిబ్బంది తదితరు లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.