మూడు వారాలలో 559 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. 52 లక్షల 80 వేల రూపాయల జరిమానా,31 మందికి వారం రోజుల జైలు శిక్ష. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి.

 

 

 

నిజామాబాద్ క్రైమ్ జూలై 18 (ప్రజాగళం )

 

 

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని లా అండ్ ఆర్డర్,ట్రాఫిక్ పి.ఎస్ లలో గడిచిన 3 వారాలలో డ్రంకన్ డ్రైవ్ లో 559 మంది పట్టు బడగా వారిని నిజామాబాద్ , బోధన్, అర్మూర్ కోర్టులలో వారిని హాజరు పర్చగా 31 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. వారికి 52 లక్షల 80 వేల రూపాయలు జరిమానా విధించినట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో చేసిన తనిఖీలలో అధిక మొత్తములో త్రాగి వాహనములు నడిపి పట్టుబడటం పోలీసులకు పట్టుబడినట్లు తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో వారి వారి పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగముగా గత నెల 29వ తేదీ నుండి ఈనెల 17వ తేదీ వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 559 కేసుల నమోదు చేయడం జరిగిందన్నారు.

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య క్రింది నిబంధనలు పాటించాలన్నారు.

ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు.

వాహనాదారులు వాహనానికి సంబంధించినటువంటి పత్రములు సక్రమముగా తమ వద్ద ఉంచుకోగలరు.

డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన వారి లైసెన్స్ 6 నెలల పాటు సస్పెండ్ చేయడం జరుగుతుందన్నారు.

మద్యం త్రాగి వాహనం నడిపి అనుకోని రోడ్డు ప్రమాదం జరిగినట్లయితే ఇన్సూరెన్సు లభించదన్నారు.మైనర్లు తాగి వాహనం నడిపి పోలీస్ వారికి దొరికినటైతే మైనర్ వెహికల్ ఓనర్ పైన ఛార్జ్ షీట్ నమోదు చేయబడునని,అలాగే జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందన్నారు.

ఒక సారి కంటే ఎక్కువ సార్లు పట్టుబడినట్లయితే జైలు శిక్ష విధించబడుతుoదన్నారు.

మోటర్ వెహికల్ యాక్ట్ 1989 (చట్టం సవరణ 2019) అమలులో ఉన్నందున డ్రంక్ అండ్ డ్రైవ్ లో మొదటిసారి పట్టుబడినట్లయితే 10,000/- జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా తో పాటు జైలు శిక్ష విధించబడును. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ లో రెండోసారి పట్టుబడినట్లైతే 15,000/- జరిమానా లేదా జైలు శిక్ష లేదా జైలు శిక్షతో పాటు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని సీపీ సాయి చైతన్య సూచించారు.

Leave A Reply

Your email address will not be published.