ఉద్రిక్తతల మధ్య చలో అంకాపూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ రెడ్డి హౌస్ అరెస్ట్. పైడి రాకేష్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వచ్చిన కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు.

 

 

ఆర్మూర్ జూలై 27 (ప్రజా గళం)

 

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో అంకాపూర్ ఉదిత్తి మధ్య కొనసాగింది. అంకాపూర్ ఆర్మూర్లో భారీగా పోలీస్ బందోబస్తు ను ఏర్పాటు చేశారు. ఉదయం కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు అంకాపూర్ లో ఎమ్మెల్యే ఇంటిని ముట్టిన ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలు మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటి వద్ద ఉధృత పరిస్థితి చోటుచేసుకుంది. దశలో కార్యకర్తలు గొప్ప కట్టెలతో కాంగ్రెస్ కార్యకర్తలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సైతం కార్యకర్తలకు మద్దతుగా ఉంటూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

ఆర్మూర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఛలో అంకాపూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇల్లుముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల సమయంలో ఒక్క రూపాయికివైద్యం, ఒక్కొక్క గ్రామానికి స్వచ్ఛందంగా పేదలకు పది ఇండ్లు నిర్మిస్తానని, ఒక సమత్సరంలో ఆర్మూరు కు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మర్చారని దీంతో ఎమ్మెల్యే కు గుర్తుచేయడానికోసం అంకాపూర్లోని ఇల్లు ముట్టడిస్తామని తెలపడంతో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వీడియో రిలీజ్ చేశారు. నా ఇల్లు ముట్టడించే స్థాయి మిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ఇల్లు ముట్టడించాలంటే ముఖ్యమంత్రి, మంత్రులు ముట్టడించాలని అన్నారు. దీంతో పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య ఆర్మీర్, అంకాపూర్ లో నుండి ఎల్లుండి వరకు 144 సెక్షన్ విధించారు. దీంతో ఆర్మూరు లో ఉద్రిక్తవతవరణం నెలకొనే అవకాశం ఉంది. ముందస్తుగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉదయం నుండే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ను గృహ నిర్బంధం చేశారు. పోలీసులు అత్యుత్సాహంతో మీడియా ను కూడా అనుమతించడం లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుడు వినయ్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. పోలీస్ ఉన్నతాధికారులు డీసీపీ పర్యవేక్షించారు…

Leave A Reply

Your email address will not be published.