జాన్కంపేట్ లో ఆర్టీసి బస్సు,లారీ “డీ”…పలువురికి గాయాలు…

 

ఎడపల్లి,అక్టోబర్ 21: (ప్రజా గళం)

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలోని దర్గా వద్ద ఆర్టిసీ బస్సు,లారీ “డీ”కొన్న ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ తెలిపిన కథనం ప్రకారం.. నిజామాబాద్ నుండి బోధన్ వైపు సోమవారం రాత్రి 8.45 గంటల ప్రాంతంలో వస్తున్న టిజి16 జడ్ 0093 నెంబర్ గల ఆర్టీసి బస్సు ను ఎదురుగ వెళుతున్న ఏపీ 25 యు 7677 నెంబర్ గల లారీ”డీ” కొట్టిందని అన్నా రు.లారీ డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నడిపి బస్సు ను “డీ”కొట్టినట్లు ఆమె చెప్పారు.ఈ ఘటనలో బస్సు లో ప్రయాణిస్తున్న కామారెడ్డి జిల్లా పిట్లం మండలం పెద్దాన్నారం గ్రామానికి చేందిన బోయ భూమన్నకు, నవీపేట్ మండలం నాలెశ్వర్ గ్రామానికి చెందిన బస్సు కండక్టర్ ఓగంటి ప్రకాష్ లకు తీవ్ర గాయాలు అయ్యా యని ఆమె తెలిపారు.గాయపడ్డ లారీ డ్రైవర్ షేక్. వసిం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆమె తెలిపారు.ప్రయాణికుడు భూమన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.