నిజామాబాద్ ( ప్రజాగళం అర్బన్ న్యూస్):
రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, నిజామాబాద్ రోటరీ సర్వీస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రోటరీ కృత్రిమ అవయవ కేంద్రం ద్వారా మంగళవారం స్థానిక బర్కత్పుర నందుగల రోటరీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి శిబిరం ద్వారా వచ్చిన బాధితులకు కొలతలు తీసుకొనడం జరిగినదని అధ్యక్షులు బిరెల్లి విజయరావు తెలిపారు.
దాదాపు 50 కి పైగా బాధితులు శిబిరానికి విచ్చేసి కొలతలను ఇవ్వడం జరిగినది. వీరికి కృత్రిమ కాలును తయారుచేసిన తర్వాత అందజేయడం జరుగుతుందని అన్నారు. శిబిరంలో కొందరు అనారోగ్య రీత్యా మరికొందరు డయాబెటిస్ ఇంకా యాక్సిడెంట్ల ద్వారా అనుకోకుండా జరిగిన పరిణామాలకై తమ కాలును కోల్పోవడం జరిగిందని ఈ శిబిరంలో నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, అదిలాబాద్, ధర్మాబాద్ జిల్లాలకు సంబంధించిన బాధితులు పాల్గొనడం జరిగింది.

ప్రతి సంవత్సరం రోటరీ కృత్రిమ అవయవకేంద్రం ద్వారా ఎందరో బాధితులకు కృత్రిమ కాలును అందిస్తూ వారి జీవితంలో ముందడుగు వేయడానికి ఆశతో పాటు భరోసాను కల్పిస్తుందని అన్నారు. ఇప్పటివరకు 2009వ సంవత్సరము నుండి 30కి పైగా శిబిరాలను ఏర్పాటు చేసి ఎందరో అభాగ్యులకు కృతిమకాలను అందిస్తూ భరోసా ను కల్పించామన్నారు. కార్యక్రమంలో రామకృష్ణ, జ్ఞాన ప్రకాష్, భరత్ పటేల్, జితేంద్ర మలాని తదితరులు పాల్గొన్నారు.

