బీర్కూర్, ప్రజాగళం, డిసెంబర్ 9:
సామాజిక కార్యకర్త, దళిత నాయకులైన అయ్యల సంతోష్ ను బీర్కూర్ దళిత నాయకులు ఘనంగాసన్మానించారు. బీర్కూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద దళిత నాయకులు అయ్యాల సంతోష్ ను పూలమాలలు, శాలువాతో సన్మానించారు.ఈ సందర్బంగా నాయకులు బంగారు రవి మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా అంకిత భావంతో పనిచేస్తూ, సమయం దొరికినప్పుడల్లా ASR ఫౌండేషన్ ద్వారా సామాజికంగా సేవలoదిస్తూ, మరొక వైపు దళితులను చైతన్యం చేస్తూ, సమయాన్ని మొత్తం సమాజానికి కేటాయిస్తున్న సామాజిక కార్యకర్త అయ్యల సంతోష్ అని కొనియాడారు. దళితులను చైతన్య పరచడమే కాకుండా,ప్రతి ఒక్కరికి మార్గదర్శక గా నిలుస్తూ ముందుకు సాగుతున్నారుఅన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూనే, సమాజానికి తనవంతు సేవలందిస్తున్నారు.ఇలాంటి వ్యక్తులు అరుదుగా జన్మిస్తారన్నారు.ఈ కార్యక్రమంలో సంగు గోవర్ధన్, బద్రి గంగారాం, బాలకృష్ణ,సుభాష్,లక్ష్మణ్,పవన్,పండరి, రవి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
*దళిత నాయకులు అయ్యల సంతోష్ కు సన్మానం.*
Prev Post

