బాన్సువాడ రూరల్, ప్రజాగళం, డిసెంబర్ 10:
బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలమేరకు మంగళవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాన తల్లికి పాలాభిషేకం చేశారు. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే తెరాస నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వ హయాంలోనే, పేదలకు,రైతులకు న్యాయం జరిగిందన్నారు. పేద ప్రజల జీవితాలు వెలుగులు రావాలంటే తిరిగి తెరాస ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త, ఎవరికి భయపడకుండా నిర్భయంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. దేశంలోనే అట్టర్ ప్లాప్ సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన విమర్శించారు. బాన్సువాడ ప్రజలకు అందుబాటులో ఉండి న్యాయం చేస్తారని, పోచారం శ్రీనివాస్ రెడ్డి ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజలకు విమర్శించారు. కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, నాయకులు మోచి గణేష్, శివ, సూరి, రమేష్ యాదవ్ మాధవరెడ్డి ప్రశాంత్ గౌడ్ సాయిలు,మధు, మహేష్, మౌల అనిల్, జీవన్ , కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

