*పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించండి* *DM&HO డాక్టర్ బి. రాజశ్రీ*

నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్ న్యూస్):

పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడం ద్వారా అనేక రకాలైనటువంటి శ్వాసకోస ఊపిరితిత్తుల వ్యాధులే కాకుండా క్యాన్సర్ లాంటి వ్యాధుల్ని కూడా నియంత్రించి స్వచ్ఛమైన ఆక్సిజన్ ను పీల్చుకోవచ్చని DM&HO డాక్టర్ బి రాజశ్రీ తెలిపారు. స్వచ్ఛమైన ఆక్సిజన్ ను పీల్చుకోవడం ద్వారా ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా మారుతారని అన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరు పర్యావరణ కాలుష్య నియంత్రణ చర్యలను చేపట్టటం లో భాగంగా మొక్కల్ని నాటడం , లైట్లు ఆఫ్ చేయడం ద్వారా విద్యుత్తిని ఆదా చేయడం, ఆహార పదార్థాల వ్యర్తాలను నియంత్రించడం ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలను కాల్చి వేయడాన్ని ఆపేయడం , జీవనశైలిలో మార్పులు తెచ్చుకుంటూ నడకని, సైకిల్ ని ఉపయోగిస్తూ కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలను ఉపయోగాన్ని తగ్గించడం, విద్యుత్ తో నడిచే వాహనాలను అందరూ ఉపయోగించేలా ప్రోత్సాహించడం, నీటి వృధానే అరికట్టడం లాంటి చర్యల వల్ల వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చు అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కీటక జనతా వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్, అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ వినీత్ రెడ్డి, జిల్లా ఆరోగ్య విద్య మిషన్ ప్రతినిధి వెంకటేశ్వర్లు, కోఆర్డినేటర్ వెంకటేశం, సులోచన, సలీం, వివిధ PHC ల నుండి వచ్చిన పర్యవేక్షకఅధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.