*ద్వారకా నగర్ లో కోతులు కుక్కల బెడద, ఆకాతాయిల అల్లర్లు, మద్యం సేవించి వీరంగం …….*

నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్ న్యూస్):

నగరంలోని ద్వారకా నగర్ లో ఆకతాయిల అల్లర్లు, కోతులు కుక్కల బీభత్సం రోజురోజుకు పెరిగిపోతున్నదని అక్కడి కాలనీవాసులు వాపోతున్నారు. రాత్రిళ్ళు కుక్కలు మొరగడం కారణంగా నిద్ర కూడా సరిగా ఉండడం లేదని దీనికి తోడు కాలనీలోని ఆకతాయి కుర్రాలు రాత్రి 11 రాగానే మధ్యంతాగి చేసే అల్లర్లు భరించలేకుండా ఉన్నామని తెలుపుతున్నారు. ఇదే రోడ్లో 4 నుండి ఐదు వరకు లేడీస్ హాస్టల్స్, మెస్ లు ఉంటాయి. వారు మిగిలిన ఆహారం మోరీలు పడవేయడం పక్కకు వేయడంతో కుక్కల బెడద కోతుల బెడద విపరీతంగా పెరిగిపోయిందని తెలుపుతున్నారు.

డ్రైనేజీలలో పడ వేసే వేస్ట్ పదార్థాల కారణంగా డ్రైనేజ్ స్టక్ అయిపోతున్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు శ్రద్ధచూపి పెట్రోలింగ్ చేస్తూ, బల్దియా సిబ్బంది డ్రైనేజీలను రోడ్లను పరిశుభ్రం గా ఉంచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.