*NGS స్నాతకోత్సవ వేడుకలు*

నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్ న్యూస్):
నిజామాబాద్ పట్టణంలోని ముబారక్ నగర్ లో గల నవ్యభారతి గ్లోబల్ స్కూల్ స్నాతకోత్సవ వేడుకలు రెండు రోజులపాటు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన కవి గాయకుడు పెంచలయ్య
మాట్లాడుతూ NGS క్యాంపస్ చాలా విశాలంగా చాలా అందంగా, పరిశుభ్రంగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. నిజామాబాద్ పట్టణంలోనే అత్యధిక స్థలము ఆట స్థలము పార్కింగ్ స్థలం కల ఏకైక స్కూల్ NGS అని కొనియాడారు.

ఓన్లీ సబ్జెక్టు పరంగానే కాకుండా అన్ని రంగాలలో స్పోర్ట్స్ ,డాన్స్, క్రికెట్, స్విమ్మింగ్, టెన్నిస్,field వర్క్ తదితర రంగాలలో విద్యార్థులను తీర్చిదిద్ది తున్నందుకు NGS ఛైర్మెన్ K. సంతోష్ కుమార్ ను అభినందించారు. NGS లో చదువుతున్న విద్యార్థులు అదృష్టవంతులు అని అన్నారు. ఈ సందర్భంగా ఎన్జీఎస్ చైర్మన్ క్యాతం సంతోష్ కుమార్ మాట్లాడుతూ CBSE సిలబస్ తో 8th వరకు ఉన్న స్కూలు టెన్త్ క్లాస్ వరకు సెంట్రల్ ప్రభుత్వానికి అప్గ్రేడ్ చేయడం జరిగిందన్నారు. దీనితో 1st టు 10th వరకు విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్లీ 9, 10 తరగతిలో ఎక్కడ చదవాలో అని విద్యార్థులు తల్లిదండ్రులు మదన పడకుండా అసౌకర్యంకి గురికాకుండా పదో తరగతి వరకు సెంట్రల్ అనుమతితో ఎక్సటెండ్ చేయడం జరిగిందన్నారు. విద్యార్థులను విద్యా బోధన తోపాటు అన్ని రకాల స్పోర్ట్స్ కల్చరల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో మా విద్యార్థులు పాల్గొనేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. అనంతరం ఒకటి నుండి 5 వరకు చదువుకునే విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి చూపరులను మంత్రముగ్ధులను చేశారు.

ఆదివారం 6 వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారని NGS చైర్మన్ K. సంతోష్ కుమార్ తెలిపారు. విద్యార్థులను తీర్చిదిద్దడమే ధ్యేయంగా NGS ను నడుపుతున్నామన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులకు ఎలాంటి భయం లేకుండా గుండె మీద చేయ్యి వేసుకుని భరోసాగ వారి పిల్లలను NGS కు పంపవచ్చన్నారు. కార్యక్రమానికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో రకాల సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులు నిర్వహించారు వారికి అభినందనలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.