హైదరాబాద్ (ప్రజాగళం అర్బన్ న్యూస్):
సినీ నటుడు మోహన్ బాబు ఆయన కుమారుడు మంచు మనోజ్ ల కొట్లటాను గంటల కొద్దీ న్యూస్ ఛానల్ లలో చూపడం ను ప్రజలు అవహేళన చేస్తున్నారు. మీడియా ఫై దాడి చేయడం ను తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. టీవీమాధ్యలలో గంటల తరబడి సినీ నటుడు మోహన్ బాబు మంచు మనోజ్ ల కోట్లాటను చూపడం సబబుగా లేదంటున్నారు. సినిమాల ద్వారా ప్రజలకు దిశ నిర్దేశం చేయవలసిన సినీ నటులే ఇలా తండ్రి కొడుకులు కొట్టుకోవడం ప్రజలు ఛీ కొడుతున్నారు. అక్కడ పోలీసు ఉన్నతాధికారులు సెక్యూరిటీ ఉండి కూడా చోద్యం చూడడం ఇంకో వింత.

తెలంగాణ సినీ నటులు అంటేనే ప్రజలకు విసిగొస్తుంది. ఒక్కొక్కళ్ళు మూడు నాలుగు వివాహాలు చేసుకోవడం, డైవర్స్ ఇవ్వడం కోర్ట్ కేసులు పెట్టడం వీటన్నిటి చూసి ప్రజలు సినీ నటులు అంటేనే చీ కొడుతున్నారు. వాళ్లు ఏమి చేసినా అది ఒక వింత అవుతుంది. కానీ తెలంగాణ ప్రజలపై ప్రభావం పడకుండా టీవీ మాధ్యమాలు తక్కువగా చూపిస్తే మంచిది అంటున్నారు. లేకపోతే ప్రజలు కూడా అలాగే తయారవుతారని అంటున్నారు.

