*వేతనాలు తక్షణమే చెల్లించాలి PRTU డిమాండ్*

నిజామాబాద్ (ప్రజగళం అర్బన్ న్యూస్):
ఇవాళ ఇటీవల నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులకు వేతనాలు తక్షణమే చెల్లించాలని పిఆర్టియు తెలంగాణ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ డిమాండ్ చేశారు. గురువారం డీఈఓ ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కృపాల్ సింగ్ మాట్లాడుతూ సంబంధిత ఉపాధ్యాయులు ప్రభుత్వ మరియు జిల్లా విద్యాశాఖ అధికారులు ఇచ్చిన నియామక ఉత్తర్వులు మరియు జాయినింగ్ రిపోర్టు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎంప్లాయిస్ వెల్ఫేర్ ఫండ్ ర్స్50/DDO గారే కట్ చేయాల్సి ఉంటుంది.), జిల్లా విద్యాశాఖ అధికారి జారీ చేసిన నూతన ఉపాధ్యాయుల జాబితా తో పాటు ACT 2 సర్టిఫికెట్ జిరాక్స్ పై సంబంధించిన DDO చేత అటెస్ట్ చేయించిచేసి ట్రెజరీ అధికారులకు ఇన్ డూప్లికేట్ బిల్లులు సమర్పించిన తర్వాతే వేతనాలు మంజూరు చేయబడతాయని, ఈ విషయము నూతన ఉపాధ్యాయులందరూ గ్రహించాలని విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.