ప్రభుత్వ పనుల పేరుతో ఇసుక అక్రమ రవాణా

బోధన్, మార్చి 21( ప్రజాగళం)

సాలురా మండలం మంధర్న గ్రామంలో మంజీర నది నుండి ప్రభుత్వ పనుల పేరుతో అక్రమ ఇసుక రవాణాను చేస్తున్నారని, పర్మిషన్ తీసుకొని అంతకంటే ఎక్కువ ఇసుక ను రవాణా చేస్తున్నారని సాలూరా మండల రైతులు ఆరోపిస్తున్నారు.

ఒక్కొక్కరికి వారం అనుమతి ఇవ్వడంతో ఇష్టారితిన తరలించి ప్రైవేటు కట్టడాల వద్ద అధిక ధరకు అమ్ముకుంటున్నారన్నారు. దీనిని పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని ఇంత తంతు నడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం.ఇలా ప్రతిరోజూ ఇసుకను తరలించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి తమ బోర్లల్లో నీళ్లు తగ్గి పోతున్న పరిస్థితి ఏర్పడుతుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకట్టు వేయాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.