నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్):
TGOs Association సమావేశం మరియు సభ్యత్వ డ్రైవ్ నిర్వహణ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జరిగింది ఇందులో ఈ కింది సమావేశాలపై నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశంలో ప్రధాన అంశాలపై చర్చ జరిగింది:
సర్వ మెడికల్ కళాశాలలకు సాధారణ బదిలీలను నిర్వహించాలని TGOs డిమాండ్ చేసింది.
కొత్తగా ఏర్పడిన మెడికల్ కళాశాలల్లో తక్షణమే నియామక ప్రక్రియ ప్రారంభించాల్సిన అవసరం ఉందని సూచించారు.
హైదరాబాద్ నగర పరిధిలో జూనియర్ డాక్టర్లు పని చేస్తున్నా, సీనియర్ డాక్టర్లు జిల్లాల మరియు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తుండటం అన్యాయం అని పేర్కొన్నారు. సీనియర్లను పట్టించుకోకపోవడం అధికారులు చూపిస్తున్న నిర్లక్ష్యానికి తగిన శాసనం అవసరమని అభిప్రాయపడారు.
మునుపటి లాగానే పదోన్నతుల కోసం సేవలకు ఆధారంగా వెయిటేజి పాయింట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇది అమలులో ఉంది అని TGOs డిమాండ్ చేసింది.
పీఆర్‌సీ బకాయిలు ఇంకా విడుదల కాలేదు. వీటిని వెంటనే విడుదల చేయాలని TGOs సంఘం డిమాండ్ చేసింది.
జనాభా పెరుగుదల మరియు జీవన ఖర్చు పెరిగిన దృష్ట్యా HRA శాతం పెంచాలి అని TGOs నొక్కిచెప్పింది.
ప్రస్తుతానికి 22 గైనకాలజిస్టుల లో కేవలం 6 మంది మాత్రమే పని చేస్తున్నారు. మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కష్టమని TGOs తెలిపింది.
మునుపటి జోన్ ఆధారిత స్థితిని పునరుద్ధరించి, కొత్త నియామకాల్లోనూ అదే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
గర్భిణీ మహిళ వైద్యులను ఇతర జిల్లాలకు డిప్యుటేషన్ పై పంపడాన్ని నిలిపివేసి, వారి స్వచ్ఛంద అభిప్రాయాన్ని గౌరవించాలనే విజ్ఞప్తి కూడా చేశారు. ఈ కార్యక్రమంలో
జలగం తిరుపతి రావు, అసోసియేట్ అధ్యక్షుడు
దేవిసింగ్ , TGOs ఖజాంచి
ఎన్. రాములు, ఉపాధ్యక్షుడు డా. నాగమోహన్, సంయుక్త కార్యదర్శ డా. డండు స్వామి, అర్బన్ యూనిట్ అధ్యక్షుడు
జగదీశ్ , అర్బన్ యూనిట్ కార్యదర్శి
నాగరాజు , EC సభ్యుడు అలాగే ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు చెందిన అనేక మంది వైద్యు లు పాల్గొన్నారు .

