ఉత్తమ సేవలకు విజయనంద్ కు ఉత్తమ వైస్ చైర్మన్ అవార్డు ప్రధానం.

 

నిజామాబాద్ జులై 6 ( ప్రజా గళం )

జేసీఐ అలుమ్ని క్లబ్ ద్వారా అందించిన ఉత్తమ సేవలకు గానూ నిజామాబాద్ నగరానికి చెందిన

జిల్కర్ విజయానంద్ కు ఉత్తమ వైస్ చైర్మన్ అవార్డు దక్కింది.

విశాఖపట్నంలోని కాకతీయ కన్వెన్షన్ హాల్ లో ఆదివారం జరిగిన జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ అలుమ్ని క్లబ్స్ సౌత్ కార్నివాల్ లో

2 తెలుగు రాష్ట్రాలతో పాటు 14 రాష్ట్రాలకు చెందిన 18 క్లబ్బులు పాల్గొన్నాయి.

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో కూడిన జెసిఐ అలుమ్ని క్లబ్ ఇండియా 12వ జోన్ కు

వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న

విజయానంద్ కు ఉత్తమ జోన్ వైస్ చైర్మన్ గా జేసీఐ ఇండియా అలుమ్ని క్లబ్ నేషనల్ చైర్మన్ అంజలి బాత్ర గుప్తా, నేషనల్ వైస్ చైర్మన్ జై కుమార్ అవార్డు అందజేశారు.

కార్యక్రమం లో నేషనల్ వైస్ చైర్మన్ మనోజ్ టక్కర్, నేషనల్ కోఆర్డినేటర్ జి. వి. ఎన్.రాజు, జోన్ వైస్ చైర్మన్ లు నవీన్ , మహేష్ , శ్రీనివాస్ , జోన్ అధికారులు వినయ్, చైతన్య, సంతోష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.