నిజామాబాద్ బ్యూరో జులై 26 ( ప్రజాగళం )
తెలంగాణ రాష్ట్రంలో జాగృతి సత్తా చాటేందుకు సిద్ధం కావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. హైదరాబాద్లో శనివారం జరిగిన లీడర్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ,
ఇక్కడకు వచ్చిన వాళ్ళను చూస్తే బతుకమ్మ పండుగ ముందే వచ్చినట్లుందన్నారు.
లీడర్ శిక్షణా తరగతులు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ఈ రోజు జరిగిన ప్రోగ్రామ్ కేవలం ట్రయల్ మాత్రమేనని, ఇక ముందు తమ సత్తా ఏంటో చాటుతామన్నారు.
పదిమందిని లీడ్ చేయాలంటే ఇన్నర్ ఇంజనీరింగ్ ఉండాలన్నారు.
మనసులో గట్టిగా అనుకుని బయలుదేరితే మనల్ని ఆపే దమ్ము
ఎవరికి లేదని తేల్చి చెప్పారు.
తెలంగాణ జాగృతి బిడ్డలు ఎంతదూరం అయినా వెళ్తారని కవిత స్పష్టం చేశారు.
జీడీపీతో పాటు పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం ఎంత ఉంది,స్వేచ్ఛ ఎంత ఉందని ప్రశ్నించారు.
నేడు రాష్ట్రంలో సోషల్ మీడియాలో పోస్టు పెడితే జైల్లో పెడుతున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో పిరికి ముఖ్యమంత్రి ఉన్నారని కవిత విమర్శించారు.
సక్సెస్ కు ఒక్క హార్డ్ వర్క్ మాత్రమేనని,
కష్టం,టైమ్ మిమ్మల్ని లీడర్ చేస్తుందన్నారు.
సామాజిక అవగాహన,సమాజం పట్ల కృతజ్ఞత ఉండాలన్నారు.
తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను తీసివేస్తే మేధావులు మాట్లాడటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే తెలంగాణ జాగృతి బాధ్యత తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
బనకచర్లపై మేధావులు ఎందుకు మాట్లాడటంలేదని కవిత నిలదీశారు.
మేధావులు ప్రభుత్వాన్ని చూసి ఎందుకు భయపడుతున్నారని ఆమె అన్నారు.
మన నీళ్లు ఏపీకి వెళ్తే మేధావులు ఎక్కడినుంచి తెలంగాణకు నీళ్లు తెస్తారని కవిత ప్రశ్నించారు.
సోషల్ మీడియాను పాజిటివ్ గా వాడాలని కవిత సూచించారు.
తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఎత్తుకుని మా తెలంగాణ మాకు కావాలని పోరాటం చేశామన్నారు.
తెలంగాణ జాగృతి కార్యకర్తలకు,నాయకులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలన్నారు.
సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు.
లీడర్ శిక్షణా కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకు ఫేస్ బుక్,ట్విట్టర్,ఇన్ స్టా గ్రామ్ ఉండాలన్నారు.
ఇక్కడకు వచ్చిన మహిళా ప్రతినిధులు వేలమందికి ప్రతినిధులుగా ఉన్నారు
జాగృతి అవకాశం ఇస్తుందని అనేకమంది మహిళలు ముందుకు రావడం తమ విజయానికి సాంకేతాలు అన్నారు.
మీరు నిటారుగా నిలబడండి
మీ వెనుక నేను ఉన్నానని,
ఎవరు ఏమంటారో చూసుకుంటానని,
అసలు భయపడేది లేదని కవిత భరోసా కల్పించారు.
వచ్చే జమానా ఆడబిడ్డలదే
సగం సీట్లు ఆడబిడ్డలకే వస్తాయన్నారు.
మహిళ బిల్లు కోసం కొట్లాడిన సంస్థగా మహిళలను నాయకులుగా చేయాల్సిన బాధ్యత తెలంగాణ జాగృతికి ఉందన్నారు.
విదేశీ శాఖలు పెద్దఎత్తున ఏర్పడ్డాయని ఆమె వెల్లడించారు.
విదేశాల్లో బతుకమ్మ పండుగ ను ఘనంగా నిర్వహించి విజయవంతం చేస్తామన్నారు.
మొదట హైదరాబాద్ పై స్పెషల్
ఫోకస్ పెడతామన్నారు.
హైదరాబాద్ నగరంలో ప్రతిగల్లీలో జాగృతి జెండా ఎగరాలని కవిత పిలుపునిచ్చారు.
ప్రతి గల్లీలో జాగృతి జెండా గద్దె ఉండాలన్నారు.గతంలో 150 డివిజన్లలో జాగృతికి ఎలాంటి బలం ఉందో ఆ బలం సంతరిచుకునేలా మన కార్యాచరణ ఉండాలన్నారు.

