బోర్లం బసవేశ్వర ఆలయంలో పూజలు.

బాన్సువాడ, జూలై 26 ,ప్రజాగళం. శ్రావణమాసం మొదటి శనివారం పురస్కరించుకొని మండలంలోని బోర్లం బసవేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోర్లం బసవేశ్వరఆలయంమఠపీఠాధిపతిశ్రీ సద్గురుసోమలింగశివాచార్య మహారాజ్ఆధ్వర్యంలో ఘనంగా పూజలు జరిగాయి. శ్రావణ మాసం మొదటి శనివారం సందర్భంగా బోర్లం మాజీ ఎంపిటిసి సభ్యురాలు శ్రీమతి పెద్దపట్లోలశ్రావణి దేవేందర్ రెడ్డి దంపతులు శ్రీఆదిబసవేశ్వర ఆలయంలో అభిషేకం అర్చన పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సద్గురు సోమలింగ శివచార్య మహారాజ్ ని శాలువాతో ఘనంగా సన్మానించి ఆశీర్వాదం తీసుకున్నారు. గ్రామాలు పాడిపంటలతో,ప్రజలుసుఖసంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు.

కార్యక్రమంలో శ్రీ సద్గురు సోమలింగ శివాచార్య మహారాజ్ మఠాధిపతిఅదిబసవేశ్వర ఆలయంలోప్రత్యేకహోమం నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుపట్లోళ్ల దేవేందర్ రెడ్డి, శ్రీధర్ పూజారి, గురు లింగ్ పూజారి,మంజునాథ్ ,ప్రశాంత్ రెడ్డి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.