ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిం చాలి…..స్థానిక సర్పంచ్ కందగట్ల రాంచందర్ సూచిం చారు…. స్థానిక వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో సర్పంచ్, ఉపసర్పంచ్,వార్డు సభ్యులను ఘనంగా సన్మానం….

 

ఎడపల్లి,జనవరి 22: (ప్రజా గళం)

ఎడపల్లి మండల కేంద్రంలోని స్థానిక హెల్త్ సబ్ సెంటర్ లో ఏఎన్ఎం గంగామణి గౌడ్ ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కందగట్ల రాంచందర్(అన్నా సేట్),ఉపసర్పంచ్ మచ్కూరి గంగా ధర్ తో పాటు వార్డు సభ్యులను శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా నూతన సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డు సభ్యలకు ఆరోగ్య సిబ్బంది శుభాకాంక్ష లు తెలిపారు.ఈ సందర్బంగా ఏఎన్ఎం.గంగామణి గౌడ్ మాట్లాడుతూ..ఆరోగ్య ఉప కేంద్రంకు సంబందిం చిన పలు సమస్యలు పరిష్కరించాలని సర్పంచ్, పాలకవర్గ సభ్యులను కోరారు.తాము ప్రజలకు అందు బాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నామని, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న వారికి ప్రాథమిక చికిత్స లు అందిస్తున్నామని పేర్కొన్నారు.సర్పంచ్ కందగట్ల రాంచందర్ మాట్లాడుతూ..వైద్య సిబ్బంది, ఆసుపత్రి సమస్యలు ఏవి ఉన్నా తన దృష్టి కి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ప్రజలకు మంచి సేవలు అందిస్తూ అందుబాటులో ఉండాలని అయన సూచించారు..ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్.వినీత్ కుమార్ రెడ్డి,ఉప సర్పంచ్ మచ్కూరి గంగాధర్,పంచాయతీ కార్యదర్శి నాగరాజు గౌడ్,జూనియర్ అసిస్టెంట్ దత్తు,అస్పత్రి సూపర్ వైజర్ రాజేశ్వర్,వార్డు సభ్యులు బర్దిపూర్ విట్టల్,మనూర్ మోహన్,షేక్.అస్లాం,ముస్తాక్,ఇసాక్,శంకర్,సదానంద్,వైద్య సిబ్బంది గంగామణి గౌడ్,సరిత,ఆశా వర్కర్లు గంగామణి,మంజుల,లక్ష్మి,సుశీల తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.