బోధన్ ప్రతినిధి,జనవరి 22: (ప్రజా గళం)
బోధన్ పట్టణంలోని చెక్కి తలాబ్ వద్ద గురువారం సాయంత్రం శ్రీ సాయి ప్రసన్న హైస్కూల్‌కు చెందిన పాఠశాల బస్సు ప్రమాదానికి గురైనప్పటికీ,విద్యార్థు లందరూ సురక్షితంగా బయటపడ్డారు.ప్రమాద సమ యంలో బస్సులో ఉన్న చిన్నారులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకు న్నారు.స్థానికులు తక్షణమే స్పందించి పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.తమ పిల్లలు క్షేమంగా ఉన్నారని తెలుసుకున్న తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

