బోధన్ ప్రతినిధి,మార్చి 5: (ప్రజా గళం)
ఇటీవల మున్సిపల్ ఎన్నికలో బిజెపి పార్టీ నుండి నూతనంగా గెలుపొందిన నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని కార్పొరేటర్లు,కౌన్సిలర్లకు ఆత్మీయ సభ ఏర్పాటు చేయడం జరిగింది అని,బిజెపి బోధన్ నియోజకవర్గ నాయకులు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి తెలిపారు.ఈ నెల 6 వ తేదీ శుక్రవారం నిజామాబాద్ లోని మాధవ నగర్ కమ్మ సంఘంలో ఆత్మీయ సభ జరుగనున్నదని అయన తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మల్కా జిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, నిజామా బాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఆత్మీయ అతిధిగా హాజరవుతున్నట్లు అయన చెప్పా రు.ఈ సందర్బంగా.మున్సిపల్ కార్పొరేటర్లు,కౌన్సిలర్ లు,వివిధ మండలాల బిజెపి అధ్యక్షులు,సీనియర్ నాయకులు,ప్రజాప్రతినిధులు,తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు..

