కుర్నాపల్లి గ్రామంలో ఆనంద రంగుల హోలీ….భారీ గుండు రాయిని ఎత్తిన నాయకులు, యువకులు….

 

ఎడపల్లి,మార్చి 4: (ప్రజా గళం)

ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో ఆనందోత్సాహల మధ్య హోలీ పండుగ వేడుకలు జరుపున్నారు.ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు దుబ్బాక రవీందర్ గౌడ్ తో పాటుబిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు గ్రామస్తులతో కలిసి హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలో హోలీ పండుగ వేడుకల సంబురాలు మిన్నంటాయి.గ్రామంలో తిరుగుతూ హోలీరా హోలీ చెమ్మఖేళి అంటూ నినాదాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ పండుగ సంబురాలు జరుపుకు న్నారు.అనంతరం గ్రామంలోని ఉమామహేశ్వర శివాలయం వద్ద బిఆర్ఎస్ నాయకుడు దుబ్భాక రవీందర్ గౌడ్ భారీ గుండు రాయిని బుజం ఫైకి ఎత్తడంతో, యువకులు,నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.మరి కొంతమంది యువకులు గుండు రాయి ఎత్తే ప్రయత్నం చేశారు.ఈ హోలీ వేడుకల్లో బిఆర్ఎస్ నాయకులు రవీందర్ గౌడ్ తో పాటు మహేష్ గౌడ్,కె.సంతోష్ రెడ్డి,పరశురామ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.