ఇందూరులో కాషాయ ధ్వజావిష్కరణ. -హైందవ సంస్కృతిని కాపాడుకుందామని పిలుపు. -ఘనంగా ఉగాది ఉత్సవాలు. -పాల్గొన్న కాషాయ శ్రేణులు.

నిజామాబాద్ సిటీ , మార్చి 19( ప్రజాగళం )

నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ హనుమాన్ దేవాలయం వద్ద ఉన్న సమర్థ రామదాసు చౌరస్తాలో గురువారం శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో కాషాయ ధ్వజావిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. సమర్థ రామదాసుతోపాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ కలిసున్న విగ్రహం వద్ద వరుసగా రెండో ఏడాది ఉగాది పండగ సందర్భంగా కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరించారు.ఈ మహిమాన్విత కార్యక్రమానికి సారంగాపూర్ ఆలయ ప్రధాన అర్చకులు శశి మహారాజ్, నాగభూషణ్ గురుస్వామి, కార్పొరేటర్ బంటు రాము లు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజావిష్కరణ చేస్తూ, హైందవ ధర్మాన్ని, అందులోని ఆధ్యాత్మిక స్ఫూర్తిని లోకానికి చాటారు.ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ సేవా సమితి జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ శివాజీ పాటిల్ మాట్లాడుతూ ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు . “నాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ధర్మ రక్షణ కోసం కాషాయ ధ్వజాన్ని ఎగురవేసేవారు. ఆ సంప్రదాయాన్ని స్మరించుకుంటూ, మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది” అని ఆయన పేర్కొన్నారు. అలాగే ఉగాది పచ్చడి విశిష్టతను వివరిస్తూ, మన ఆచార వ్యవహారాలను భావి తరాలకు అందించాలని కోరారు. తెలుగు నూతన సంవత్సరంగా భావించే ఉగాది పర్వదినాన్ని, ఉత్సాహంగా, ఉల్లాసంగా సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని కోరారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురోగ్యాలతో, ధన లాభాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. హిందూ బంధువులందరికి ఉగాది పండగ శుభాకాంక్షలు తెలిపారు. కాషాయ ధ్వజావిష్కరణలో ఆనంద్, బబురు, విజయ్, నాగరాజు, నగేష్, రాజు, ప్రదీప్, సాయి, సాయి రాములు, నితిన్, కార్తీక్, సంజయ్, బాబు, గంగాధర్, శ్రీనివాస్ రెడ్డి, రమేష్, నరసింహులు, గోవింద్ మహారాజ్, హనుమాన్ భక్తులు,స్వాములు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.