ఎడపల్లి,మార్చి 18: (ప్రజా గళం)
ఎడపల్లి మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్న త పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థి తాను చదువుకున్న పాఠశాలను మరువలేనని గుర్తు చెసుకుం టూ బుధవారం తన మంచి మనసుతో పాఠశాలకు పదివేల రూపాయలు విరాళాన్ని పాఠశాల అభివృద్ధికి అందజేశారు.గ్రామానికి చెందిన తూట్కూర్ ఆనంద్ రెడ్డి,పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ను తెలుసుకున్న పూర్వవిద్యార్థి తన వంతుగా 10,000 రూపాయలు కుటుంబ సభ్యుల చేత అందజే శారు.పాఠశా లలో తనకు విద్య బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే ఈరోజు నేను ఒక మంచి స్థాయిలో ఉన్నందుకు ఉపాధ్యాయులందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.పాఠశాలలో భోజనశాల గదిని నిర్మిస్తున్న విషయం తెలుసుకున్న తూట్కూర్ ఆనంద్ రెడ్డి సానుకూలంగా స్పందించి 10 వేల రూపాయలు విరాళాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులు బంజా శంకర్,బచ్చు లింగేష్ గుప్తా, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు ఉన్నత పాఠశాల తాజా మాజీ చైర్మన్ బర్దిపూర్ విట్టల్,ఎడపల్లి సహకార సంఘం సేల్స్ మెన్,పాఠశాల పూర్వ విద్యార్థి ప్రభాకర్ గౌడ్ తదితరులు ఉన్నారు.

