బాన్సువాడ, మార్చి 31, ప్రజాగళం.
మేరా యువ భారత్ ఆధ్వ ర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను బాన్సువాడ పట్ట ణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో మంగళవా రం ఘనంగా నిర్వహించారు. పోటీల్లో బాన్సువాడ, బిచ్కుం ద, గాంధారి, ఎల్లారెడ్డి, నిజాం సాగర్ బ్లాక్‌లకు చెందిన క్రీడా కారులుఉత్సాహంగాపాల్గొన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా బాన్సువాడ పట్టణ సీఐ శ్రీధర్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ వెంకట రెడ్డి హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. క్రీడలు ఆడడం వల్ల మానసిక ఉల్లాసం, శారీర క దృఢత్వం పెరిగి ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. ఇలాంటి పోటీల్లో రాణించిన వారు రాష్ట్ర, జాతీయ స్థాయి ల్లోనే కాకుండా అంతర్జాతీయ ఒలింపిక్స్‌లో కూడా సత్తా చాటగలరని తెలిపారు.

గెలుపు-ఓటములు సహజ మని, కానీ గెలవాలనే తపన, పట్టుదల ఉంటే విజయం తప్పకుండా సాధ్యమ వుతుం దని విద్యార్థులకు సూచించా రు.ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మేరా యువ భారత్ జిల్లా అధికారి బెల్లాల్ శైలీ, బాన్సువాడ రూర ల్ సీఐ తిరుపతయ్య హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. వాలీబాల్‌లో నిజాంసాగర్ జట్టు, కబడ్డీలో బాన్సువాడ జట్టు, చెస్‌లో బిచ్కుంద మొదటి బహుమ తులు సాధించాయి. పరుగు పందాల్లో బాన్సువాడకు చెందిన భరత్, మహిళల విభాగంలో తెరిస్సా, చదరం గంలో ఐశ్వర్య విజేతలుగా నిలిచారు.ఈ సందర్భంగా జిల్లా యూత్ ఆఫీసర్ బెల్లాల్ శైలీ మాట్లాడుతూ మేరా యువ భారత్ యువతలో సేవాభావాన్ని పెంపొం దించడంలో, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. నేషనల్ యూత్ ఫెస్టివల్, ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేం జ్ ప్రోగ్రాం, యూత్ పార్లమెం ట్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా యువతకు విస్తృత అవ కాశాలుకల్పిస్తున్నట్లుచెప్పారు కార్యక్రమంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మాని టరింగ్ కమిటీ సభ్యుడు సునీల్ రాథోడ్, పీఈటీలు తారాచంద్, సురేందర్, ప్రేమ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

