బోధన్ ప్రతినిధి,మార్చి 31: (ప్రజా గళం)
నేటి నుంచి దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పోరాడి సాధిం చుకున్న కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడులను అమలు జరపటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణ యించటాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం అలాగే ప్రజా సంఘా ల ఆధ్వర్యంలో మంగళవారం బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్లే కార్డులను ప్రదర్శిస్తూ ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతి రేకంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిర సన వ్యక్తం చేశారు.అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ లు మాట్లాడుతూ..అనేక దశాబ్దాలుగా కార్మి క వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ, పెట్టుబడిదారులకు,కార్పొరేట్ కంపెనీలకు కార్మిక వర్గా న్ని బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడులను తీసుకువచ్చి వాటిని రేపటినుండి అమలు జరపాలని నిర్ణయించారని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వారు చెప్పారు.ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని కార్మిక చట్టాలను అమలు జరపాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ కేరళ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడులను తమ రాష్ట్రంలో అమలు జరపమని నిర్ణయించి అసెంబ్లీలో తీర్మానం చేయటం జరిగిందని,అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో పేపర్ కోడ్లను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని వాటిని అమలు జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటంలోకి రావాల్సి వస్తుందని వారు అన్నారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికులతో పాటు రైతాంగాన్ని,ప్రజలను నష్టపరిచే విద్యుత్తు సవరణ బిల్లును తీసుకురావడం కూడా సరైనది కాదని దాన్ని వెనక్కి తీసుకోవాలని వారన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షు లు శంకర్ గౌడ్,వికలాంగుల సంఘం జిల్లా కార్యదర్శి యేశాల గంగాధర్,రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యద ర్శులు ఎం.గంగాధరప్ప,పి.వెంకటేష్,సిఐటియు జిల్లా కోశాధికారి నన్నే సాబ్,నాయకులు పోశెట్టి,గోపి, కుమా రస్వామి తదితరులతో పాటు వివిధ సంఘాల కార్యక ర్తలు పాల్గొన్నారు.

