బోధన్ ప్రతినిధి,మే 2: (ప్రజా గళం)
బోధన్ కోర్టులో ద్వితీయ శ్రేణి స్పెషల్ జ్యూడిషియల్ న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన శేష తల్ప సాయి శనివారం ఉద్యోగ విరమణ చేశారు.ఈ సంద ర్బంగా స్థానిక కోర్టులో ఉద్యోగ విరమణ చేసిన న్యాయమూర్తి శేష తల్ప సాయి ని న్యాయవాదులు,పోలీస్ అధికారులు శాలువతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు,అలాగే బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ, రూరల్ సీఐ విజయ్ బాబు, పోలీసు సిబ్బంది, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

