మే 5న జరిగే ఒక్కరోజు నిరాహార దీక్ష ను విజయవంతం చెయ్యాలి. ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ నా శెట్టి సుమన్ కుమార్.

 

నిజామాబాద్ సిటీ మే 2 (ప్రజా గళం)

రాష్ట్ర ఉద్యోగ,గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక& పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు ఈ నెల 5వ తేదీన నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో తలపెట్టిన ఒకరోజు నిరాహార దీక్ష విజయవంతం చేయాలని ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నిరాహార దీక్ష సన్నాహక సమావేశాన్ని శనివారం టీఎన్జీవోస్ జిల్లా కార్యాలయం స్వర్గీయ బి.స్వామినాథం సమావేశ మందిరంలో, టి జి ఈ జేఏసీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న టి జి ఈ భాగస్వామ్య సంఘాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ.. ఈ కింద తెలుపబడిన ప్రధానంగా నాలుగు డిమాండ్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.జూన్ రెండు లోపు పిఆర్సిని అమలు చేయాలి. పెండింగ్ బిల్లులను ఒకేసారి చెల్లించాలి.

హెల్త్ కార్డులను వెంటనే అమలు చేయాలి

సి పి ఎస్ విధానాన్ని రద్దుచేసి ఓ పి ఎస్ విధానాన్ని అమలు చేయాలి, అలాగే 01.04.2004 కు ముందు నోటిఫికేషన్ వెలువడి ప్రస్తుతం సి పి ఎస్ లో ఉన్న ఉద్యోగులను వెంటనే ఓ పి ఎస్ లోనికి తీసుకొని రావాలి ,వీటితో పాటు మిగతా 64 డిమాండ్ల సాధనకు మే 5వ తేదీన చేపట్టబోయే ఒకరోజు నిరాహార దీక్ష ను విజయవంతం చేయుటకు గాను టి జి ఈ జేఏసీ భాగస్వామ్య సంఘాల సభ్యులందరూ పెద్ద ఎత్తున ఉద్యోగులతో తరలి వచ్చి శాంతియుతంగా దీక్షను విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వీరితోపాటు టిజిఈ జేఏసీ భాగస్వామ్య సంఘాల జె ఎ సి జిల్లా నాయకులు P. మోహన్ రెడ్డి, నేరెళ్ల శ్రీనివాస్, నేతికుంట శేఖర్, జాకీర్ హుస్సేన్, వనమాల సుధాకర్, శ్రీకాంత్, జమీలుల్లా, రమణాచారి, ఓమాజీ, పోల శ్రీనివాస్, రాజీవ్, గంగాకిషన్, వీరేందర్ సింగ్, అన్వర్ అలీ, వినోద్, జాఫర్ హుస్సేన్, స్వామి, జ్ఞానేశ్వర్, కార్తీక్, శశికాంత్ రెడ్డి, సృజన్ కుమార్, ప్రవీణ్ రాజ్, ధరమ్ సింగ్, శ్రీరాములు, పురుషోత్తం, రవీందర్, సూర్య ప్రకాష్, ఆంజనేయులు, అశ్విన్ కుమార్,సిర్ప రాజు, మహేందర్ ,అనురాధ, వినీత, గంగరాజు, మంగమ్మ, వెస్లీ తదితరులు అధిక సంఖ్యలో హాజరై 5వ తేదీన, నిర్వహించబోయే ఒక రోజు నిరాహార దీక్షను విజయవంతం చేయుటకు తమవంతుగా కృషి చేస్తామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.