ఎడపల్లిలో ఘనంగా అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు….కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రె స్ నాయకులు….పిల్లలకు బిస్కెట్లు,ఫ్రూట్ జ్యూస్ పంపిణి చేసిన నాయకులు….

 

ఎడపల్లి,జూన్ 19: (ప్రజా గళం)

ఎడపల్లి మండల కేంద్రంలోని భవిత పాఠశాలలో చిన్న పిల్లల మధ్య జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత,ప్రధాన ప్రతిపక్ష నేత,రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బిల్లా రామ్మోహన్ ల ఆదేశాలమేరకు జైతాపూర్ గ్రామ సర్పంచ్,ఎడపల్లి మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు నాగుల రాజు గౌడ్,ఎడపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రత్నాకర్ రెడ్డిల ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను చిన్నారుల మధ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్నపిల్లతో కలిసి కేక్ కట్ చేసి అగ్రనేత రాహుల్ గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం చిన్నపిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు,ఫ్రూట్ జ్యూస్ లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్,మాజీ సిడిసి చైర్మన్ శంకర్ నాయుడు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి,జమలం సర్పంచ్ దొడ్డి శ్రీనివాస్,ఎంఎస్సి ఫారం సర్పంచ్ నోము ల జయశ్రీ శ్రీనివాస్ గౌడ్,పోచారం సర్పంచ్ నీరాడి జ్యోతి రవి కుమార్,ఎడపల్లి గ్రామ ఉప సర్పంచ్ ముచ్కూరి గంగాధర్,తెలంగాణ లోకల్ ఫోర్స్ వ్యవస్థా పక అధ్యక్షులు డల్లా సురేష్,పురం శేఖర్,శివరాం ప్రసా ద్,యాసాడా రాజ్ కుమార్,జైతపూర్ గ్రామ ఉప సర్పం చ్ భార్గవ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,స్వామి గౌడ్,సురేష్,గోపి,అఖిలేష్ గౌడ్,తదితరులు పాల్గొన్నా రు.

Leave A Reply

Your email address will not be published.