కుర్నాపల్లిలో ఘనంగా అగ్రనేత రాహుల్ గాంధీ జన్మది న వేడుకలు…శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకు లు…విద్యార్థులకు పండ్లు పంపిణి చేసిన నాయకులు..

 

ఎడపల్లి,జూన్ 19: (ప్రజా గళం)

ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత,పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహు ల్ గాంధీ పుట్టినరోజు సందర్బంగా శుక్రవారం జడ్పి, ప్రైమరి పాఠశాలల్లో విద్యార్థులకు పండ్లు పంపిణి చేశారు.స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత,ప్రధాన ప్రతిపక్ష నేత,రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుని,రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పరిగె సాయిలు,ఉపసర్పంచ్ రామ స్వామి,ఉమామ హేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కొప్పుల చంద్రశేఖర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కృష్ణ రెడ్డి,యూత్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోండ్ర సంజయ్, మైనార్టీ సెల్ జిల్లా వైస్ చైర్మన్ ఎండీ.ఎజాస్,విగ్రహ దాత ముదక్ పల్లి కొమర సాయిలు,కాట్నపల్లి రాజ గౌడ్,గ్రామ పెద్దలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.