ఎక్సైజ్ కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన…. తక్షణమే మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి.. కల్తీ కల్లు విక్రయదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి….బాధితుల డిమాండ్….

 

బోధన్ ప్రతినిధి,జులై 4: (ప్రజా గళం)

బోధన్ పట్టణంలోని నర్సాపూర్ గేట్ వద్ద కల్లు దుకా ణంలో ఓ వ్యక్తి కల్లు తాగి మృతి చెందగా.. మరొకరు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన నియోజకవర్గంలో కలకలరం రేపింది.ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి కుటుంబీకులు శనివా రం బోధన్ పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవా లని వారు డిమాండ్ చేశారు.కల్తీ కల్లు తాగడం వల్లే మృతి చెందాడని,మృతి చెందిన వ్యక్తి సంబంధీకులు కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు.ఘటనపై సమగ్ర విచారణ చేపడతామని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రావు తెలిపారు.బాధిత కుటుంబానికి తక్షణ మే న్యాయం చేయాలని,కల్తీ కల్లు విక్రయదారు లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.