విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాము….టిజి ఎన్పిడిసిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి వెల్లడి..ఎడపల్లి, బోధన్ సబ్ స్టేషలను తనిఖీ చేసిన సిఎండి…..

 

ఎడపల్లి,జులై 4: (ప్రజా గళం)

నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ లో చేయడుతున్న విద్యుత్ అభివృద్ధి పనులు ఏవిధంగా కొనసాగుతున్నా యని,విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యు త్ ఏ మేరకు సరఫరా చేస్తున్నారనే దానిపై పరిశీలించ డం జరిగింది అని,టిజి ఎన్పిడిసిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. ఎడపల్లి సబ్ డివిజనల్ పరిధిలోని ఎడపల్లి మండల కేంద్రంలో గల విద్యుత్ సబ్ స్టేషన్ తో పాటు సబ్ డివి జనల్ కార్యాలయాన్ని శనివారం సిఎండి వరుణ్ రెడ్డి తనిఖీ చేశారు.అంతకు ముందు డిఈ.ముక్తర్,ఏడిఈ. ప్రభాకర్,ఏఈ.కిషోర్ రెడ్డి,సిబ్బంది సిఎండి వరుణ్ రెడ్డి కీ పూల మొక్క అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం లైన్ మెన్ ల విధులు,వారి పనితీరు,వారి సమస్యలను సీఎండి అడిగి తెలుసుకున్నారు.విద్యుత్ వినియోగదారులకు అందిస్తున్న విద్యుత్ సరఫరాలో నాణ్యత గురించి,తీసుకుంటున్న చర్యలపై,విద్యుత్ లోడ్,సబ్ స్టేషన్ లు,ట్రాన్స్ ఫార్మర్ లు,విద్యుత్ పోళ్ళు, అవసరాల గురించి విద్యుత్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం సిఎండి వరుణ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..విద్యుత్ శాఖ ద్వారా కొన్ని కొత్త సబ్ స్టేషన్ లు రిక్వర్మెంట్ ఏమైన ఉన్నా యా,కొన్ని ఇంటర్ లింకింగ్ లైన్స్ పనులు కూడా వేయ డం జరు గుతుంది అని తెలిపారు.అంతేకాకుండా ప్రతి సబ్ స్టేషన్ కీ ప్రత్యామ్నాయం సప్లై ఉండాలని టేకప్ చేస్తున్నామని,ఆ వర్క్ కూడా చూస్తున్నామని అన్నా రు.అలాగే మండలంలోని బాపునగర్ లో కొత్త సబ్ స్టేషన్ కావాలని అడుగుతున్నారని,ఎక్కడెక్కడ కొత్త గా లోడ్స్ వస్తున్నాయా,కొత్తగా అగ్రికల్చర్ పై లోడ్స్ వస్తున్నాయా,అవసరాలను గుర్తించి అధిక లోడ్ తాగించేందుకు కొత్తగా ట్రాన్స్ ఫార్మార్లు,అవసరాలను పరిగణలోకి తీసుకొని సమస్య పరిష్కరించడం జరుగు తుంది అని అయన చెప్పారు.లోడ్ తగ్గిస్తూ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాల్లన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.అలా గే గ్రామాలలో,పొలాలలో వేలాడుతున్న విద్యుత్ తీగల ను గుర్తించి వాటిని సరి చేయడంతో పాటు కొత్తగా విద్యుత్ స్థంభాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని సీఎండి వరుణ్ రెడ్డి తెలిపారు.అలాగే సిబ్బంది విద్యుత్ మరమ్మత్తు పనుల్లో భద్రత పాటించాలని, విద్యుత్ ప్రమాదాల భారిన పడకుండా,ముఖ్యంగా సేఫ్టీ కోసం గ్లౌజ్ లు,ఎర్త్ రాడ్ లను తప్పనిసరిగా ఊయో గించాలని అయన సూచించారు.ఈ సందర్బంగా విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన పరికరాలు,ట్రాన్స్ ఫార్మార్లు,సబ్ స్టేషన్ ల ఏర్పాటు,స్థంబాలు,విద్యుత్ తీగలు,ఇంకా అవసరలకనుగుణంగా పరికరాలు అందిస్తామని ఎన్పిడిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి తెలి పారు.అనంతరం సబ్ స్టేషన్ లో ట్రన్స్ ఫార్మర్ లు, విద్యుత్ సరఫరా మెరుగు తీరును,అవసరాలను పర్యవేక్షించారు.సబ్ డివిజనల్ కార్యాలయాన్ని, పరిసరాల ను అయన పరిశీలించారు.ఈ కార్యక్రమం లో నిజామాబాద్ ఎస్ఈ.రాజేశ్వర్ రావు,బోధన్ డివిజ నల్ డిఈ.ఎండి.ముక్తర్,ఎడపల్లి సబ్ డివిజనల్ ఎడిఈ.ప్రభాకర్,నిజామాబాద్ ఎడిఈ కన్స్ట్రాక్షన్ తోట రాజశేఖర్,ఏఈ లు కిషోర్ రెడ్డి,బోధన్ రూరల్ ఏఈ

మారుతి,బోధన్ ఏఈ నాయిని కృష్ణ,సబ్ ఇంజినీర్ జావీద్,భూమేష్,హాజర్,ఎంఆర్టి డిఈఈ వెంకటరమ ణ,సీనియర్ లైన్ ఇన్స్ స్పెక్టర్ శంకర్ నాయక్,డిసి. రాజు,లింగం యాదవ్,లైన్ ఇన్స్ స్పెక్టర్ సత్యనారాయ ణ,లైన్ ఇన్స్ స్పెక్టర్ అబ్దుల్ పాషా,లైన్ మెన్ లు పవన్ కుమార్,సాయిబాబా,బాల్ రాజ్,అశోక్,లక్ష్మణ్,విన య్,సురేష్ బాబు,ఇన్స్ స్పెక్టర్ శ్రీను,విజయ్,నర్సయ్య, వెంకటేష్,గంగయ్య,గజానంద్,తదితరులు పాల్గొన్నా రు.

Leave A Reply

Your email address will not be published.